ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్

- ఎన్నుకున్న బీజేపీఎల్పీ.. నేడు ప్రమాణం
- నాలుగు నెలల్లో మూడోసారి సీఎం మార్పు
- దేవభూమిని బీజేపీ అవమానిస్తున్నది: కాంగ్రెస్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామిని ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్షం శనివారం ఎన్నుకొన్నది. అనూహ్య పరిణామాల మధ్య తీరథ్సింగ్ రావత్ శుక్రవారం రాత్రి తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎన్నిక అనివార్యమైంది. శనివారం కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ నేతృత్వంలో ఉత్తరాఖండ్ బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం పుష్కర్‌సింగ్ ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీరాణి మౌర్యను ఆమె నివాసంలో కలుసుకొన్నారు. ఆదివారం ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని తోమర్ తెలిపారు.
రాజ్‌నాథ్‌కు సన్నిహితుడు
45 ఏండ్ల పుష్కర్‌సింగ్ ధామి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు అత్యంత సన్నిహితుడు. 1975 సెప్టెంబర్ 16న పితోడ్గఢ్లో జన్మించాడు. 2002లో లక్నో యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేశారు. ఉదమ్‌సింగ్‌నగర్ జిల్లాలోని ఖతిమా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనను సీఎంగా ఎన్నుకోవడంపై ప్రధాని మోదీ, పార్టీ అధిష్ఠానానికి ధామి కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయ అస్థిరత..
ఉత్తరాఖండ్‌లో గడిచిన నాలుగు నెలల్లో ముగ్గురు సీఎంలు మారారు. రాష్ట్ర బీజేపీలో అసమ్మతి సెగతో మార్చిలో అప్పటి సీఎం త్రివేంద్రసింగ్ రావత్ సీఎం పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో బీజేపీ అధిష్టానం ఎంపీ తీరత్సింగ్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఇదిలాఉండగా ఉత్తరాఖండ్ ప్రజలను బీజేపీ మోసం చేసిందని, రాష్ర్టాన్ని రాజకీయ అస్థిరతలోకి నెట్టివేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. తరచూ సీఎంలను మార్చుతూ దేవభూమిని అవమానపరుస్తున్నారని కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ అన్నారు.
20 ఏండ్లలో పది మంది సీఎంలు..
ఉత్తరాఖండ్‌లో అనూహ్య రాజకీయాలు కొత్తేం కాదు. రాష్ట్రం ఏర్పడి 20 ఏండ్లు అయింది. ఈ 20 ఏండ్లలో పంది మంది సీఎంలు పనిచేశారు. అందులో 9మంది తమ పదవీకాలం ముగియకముందే దిగిపోయారు. కాంగ్రెస్ నేత నారాయణ్ దత్ తివారీ ఒక్కరే 2002-2007 మధ్యకాలంలో పూర్తికాలం సీఎంగా పనిచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

