ఈ నెల 23 నుంచి భక్తులకు పూరీ జగన్నాథుడి దర్శనం..!
Puri Temple: ఒడిశా రాష్ట్రం పూరీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగన్నాథస్వామి ఆలయంలోకి ఈ నెల 23 నుంచి భక్తులను అనుమతించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో

పూరీ: ఒడిశా రాష్ట్రం పూరీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగన్నాథస్వామి ఆలయంలోకి ఈ నెల 23 నుంచి భక్తులను అనుమతించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత మూడు నెలలుగా మూసివున్న ఆలయాన్ని ఇవాళ తిరిగి తెరిచారు. అయితే, ఇవాళ్టి నుంచి ఆగస్టు 16 వరకు ఆలయ సేవకుల కుటుంబసభ్యులకు మాత్రమే జగన్నాథుని దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కొవిడ్ విస్తృతి నేపథ్యంలో గత ఏప్రిల్ 24 నుంచి ఆలయాన్ని మూసేశారు. ఇవాళ తిరిగి తెరిచారు. తొలి దశలో ఆలయ సేవకుల కుటుంబసభ్యులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నామని, వారంతా దేవాలయ కమిటీ జారీచేసిన గుర్తింపు కార్డుతోపాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును కూడా ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక రెండో దశలో ఆగస్టు 16 నుంచి పూరీ నివాసితులన అనుమతిస్తామని చెప్పారు.
ఇక మూడో దశలో ఆగస్టు 23 నుంచి అందరూ జగన్నాథుడి దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. అయితే వారు ఆలయానికి వచ్చే ముందు కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను కానీ, కొవిడ్-19 నెగెటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టునుకానీ చూపించాల్సి ఉంటుందన్నారు. ఆర్టీ-పీసీఆర్ రిపోర్టు వ్యవధి దర్శనానికి ముందు 96 గంటలు మించకుండా ఉండాలని చెప్పారు. వీటితోపాటు ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకుని రావాలని సూచించారు.
అయితే పూరీ పట్టణంలో శని ఆదివారాల్లో వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతున్నది. కాబట్టి ఆ రెండు రోజులు ఆలయ ప్రవేశానికి కూడా ఆంక్షలు అమలవుతాయని, అందుకే ప్రతి శని ఆదివారాలు జగన్నాథుడి ఆలయాన్ని మూసివేస్తామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

