దిగి వచ్చిన కేంద్రం.. పంజాబ్, హర్యానాలో రేపటి నుంచి ధాన్యం కొనుగోలు

న్యూఢిల్లీ: రైతుల నిరసనతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పంజాబ్, హర్యానాలో ఆదివారం నుంచి ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపింది. పంజాబ్, హర్యానాలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిని అక్టోబర్ 11 వరకు వాయిదా వేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట పరిపక్వత ఆలస్యమైందని పేర్కొంది.
కాగా, కేవలం పంజాబ్, హర్యానాలో మాత్రమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలును కేంద్రం ఆలస్యం చేయడంపై రైతులు, ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో శనివారం హర్యానా, పంజాబ్‌లో రైతులు నిరసన చేపట్టారు. హర్యానాలోని అధికార బీజేపీ, జేపీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం ఇండ్ల ముందు ఆందోళన చేశారు. రైతుల నిరసనను భగ్నం చేసేందుకు పోలీసులు నీటి ఫిరంగులు ప్రయోగించారు. పంజాబ్‌లోని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద కూడా రైతులు నిరసన తెలిపారు.
రైతుల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. పంజాబ్, హర్యానాలో ఆదివారం నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే శనివారం తెలిపారు. ఈ అంశంపై తనను ఢిల్లీలో కలిసిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో కలిసి ఈ మేరకు సంయుక్తంగా ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

