Journalist humiliation | పులిట్జర్ గ్రహీత జర్నలిస్టుకు అవమానం.. న్యూయార్క్ వెళ్లకుండా అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్
Journalist humiliation | పులిట్జర్ అవార్డును అందుకునేందుకు న్యూయార్క్ వెళ్తున్న ఫొటో జర్నలిస్ట్ సనా ఇర్షాద్ మట్టూను ఎయిర్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ వద్ద అడ్డుకున్నారు. ఆమెపై విదేశాలకు వెళ్లకుండా నిషేధం ఉండటంతో అడ్డుకున్నట్లు అధికారులు చెప్తున్నారు.
Journalist humiliation | పులిట్జర్ అవార్డు గ్రహీత జర్నలిస్టుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం ఎదురైంది. న్యూయార్క్ వెళ్లకుండా మహిళా జర్నలిస్టును ఎయిర్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఎలాంటి కారణాలు తెలపకుండానే తనను అడ్డుకున్నారని ఆ జర్నలిస్ట్ విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. జమ్ముకశ్మీర్ పోలీసులు ఆమెపై విధించిన ఆంక్షల కారణంగా ఇమ్మిగ్రేషన్ వద్ద అడ్డుకోవాల్సి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది మే నెలలో కొవిడ్-19 సమయంలో కవరేజ్ చేసిన నలుగురు భారతీయ ఫొటో జర్నలిస్టులకు పులిట్జర్ ప్రైజ్ దక్కింది. వీరిలో ఈమె ఒకరు.
జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఫొటోజర్నలిస్ట్ సనా ఇర్షాద్ మట్టూ.. పులిట్జర్ అవార్డును అందుకునేందుకు న్యూయార్క్ వెళ్లేందుకు సిద్ధమైంది. మంగళవారం రాత్రి న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగా.. అక్కడి ఇమ్మిగ్రేషన్ విభాగం వద్ద అధికారులు ఎలాంటి కారణం చెప్పకుండానే అడ్డుకున్నారు. తనకు చెల్లుబాటయ్యే అమెరికా వీసా, టికెట్ ఉన్నాయని చెప్పినా వినకుండా ఆమెను విమానం ఎక్కకుండా అడ్డగించారు. అధికారులతో ఎంత వాదన చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఉసూరుమంటూ ఆమె వెనుదిరిగారు. ఢిల్లీ విమానాశ్రయంలో విదేశాలకు వెళ్లకుండా ఈమెను అడ్డుకోవడం ఇది రెండోసారి. ఇంతకు ముందు జూలై నెలలో కూడా ప్యారిస్ వెళ్లకుండా నిషేధించారు.
‘పులిట్జర్ ప్రైజ్ అందుకోవడానికి న్యూయార్క్ వెళ్తున్నాను. ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ వద్ద నన్ను ఆపారు. నా దగ్గర సరైన అమెరికా వీసా, టిక్కెట్ ఉన్నాయి. అయినప్పటికీ నన్ను విదేశాలకు వెళ్లడానికి అనుమతించలేదు’ అని జర్నలిస్ట్ సనా ఇర్షాద్ సోషల్ మీడియాలో రాశారు. ఎలాంటి కారణంగా లేకుండా తనను ఆపడం ఇది రెండోసారి అని ఆమె పేర్కొన్నది. జూలై నెలలో జరిగిన సంఘటనకు సంబంధించి ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆమె విచారం వ్యక్తం చేశారు. జీవితంలో ఒక్కసారే వచ్చే పులిట్జర్ అవార్డును అందుకునే ఛాన్స్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని నిరుత్సాహపరిచారని ఆమె తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

