పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తో పాటు వంటనూనె ధరలూ భగ్గుమంటున్నాయి. లీటర్ నూనె ప్యాకెట్ రూ. 200 పైగానే పలుకుతున్నది. ఈ సమయంలో 12 వేల లీటర్ల కుకింగ్ ఆయిల్ ఏరులై పారితే ఊరుకుంటారా? ఫొటోలో కనిపిస్తున్నది అదే. మహారాష్ట్రలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై వంటనూనె ట్యాంకర్ బోల్తా పడింది.
దీంతో ట్యాంకర్ నుంచి లీకైన ఆయిల్ కోసం స్థానికులు ఎగబడ్డారు. బిందెలు, క్యాన్లలో నూనె నింపుకునేందుకు పోటీపడ్డారు. 12 వేల లీటర్ల వంటనూనె ట్యాంకర్ ప్రాసెసింగ్ కోసం శనివారం గుజరాత్‌లోని సూరత్ నుంచి ముంబై వస్తుండగా.. తవా అనే గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది.