P.T. Usha: రాజ్యసభ చైర్మన్ చైర్లో పీటీ ఉష.. వీడియో
PT Usha: రాజ్యసభ సభా వ్యవహారాలను పీటీ ఉష నడిపించారు. ఇవాళ ఆమె చైర్మెన్ చైర్లో కూర్చుని సభను సాగించారు. ఆ బాధ్యతలు చేపట్టడం పట్ల గర్వంగా ఉందని ఆమె ఓ ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ అరుదైన ఘటన చోటుచేసుకున్నది. మేటి అథ్లెట్, ఎంపీ పీటీ ఉష.. రాజ్యసభ చైర్మన్ చైర్లో కూర్చుని సభా వ్యవహారాలను నడిపించారు. చైర్మన్ జగదీప్ ధన్కర్ సభలో లేని సమయంలో.. పీటీ ఉష సభా కార్యక్రమాలను నిర్వహించారు. పయ్యోలీ ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన పీటీ ఉష.. తన ట్విట్టర్ అకౌంట్లో ఆ ఘటనకు చెందిన వీడియోను పోస్టు చేసింది.
"Great power involves great responsibility" as said by Franklin D. Roosevelt was felt by me when I chaired the Rajya Sabha session. I hope to create milestones as I undertake this journey with the trust and faith vested in me by my people.
🎥 @sansad_tv pic.twitter.com/bR8wKlOf21— P.T. USHA (@PTUshaOfficial) February 9, 2023
సభా కార్యక్రమాలను చూడడం గర్వంగా ఉందని, మరిన్ని మైలురాళ్లను అందుకోనున్నట్లు ఆమె ఆ వీడియోపై కామెంట్ చేశారు. 2022లో బీజేపీ తరపున రాజ్యసభకు పీటీ ఉష నామినేట్ అయిన విషయం తెలిసిందే. గొప్ప శక్తి గొప్ప బాధ్యతలో ఉంటుందని ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్కు చెందిన కొటేషన్‌ను ఆమె తన వీడియోలో పోస్టు చేశారు. ప్రజలు తనపై ఉంచిన బాధ్యత, నమ్మకంతో మరిన్ని మైలురాళ్లు క్రియేట్ చేయనున్నట్లు ఆమె చెప్పారు.
పీటీ ఉష వీడియో పోస్టు చేయగానే ఆమె అభిమానులు కంగ్రాట్స్ మెసేజ్‌లు చేశారు. మహిళా స్ప్రింటర్‌గా పీటీ ఉష ఇండియా తరపున ఎన్నో రికార్డులను నెలకొల్పారు. ఏషియన్ గేమ్స్, ఏషియన్ చాంపియన్‌షిప్, వరల్డ్ జూనియర్ ఇన్విటేషనల్ మీట్లలో పాల్గొన్నారు. తన కెరీర్లో ఎన్నో జాతీయ, ఆసియా రికార్డులను ఆమె నెలకొల్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

