Professor Saibaba: ప్రొఫెసర్ సాయిబాబా రిలీజ్పై సుప్రీంకోర్టు స్టే
Professor Saibaba:ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా రిలీజ్పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. మావోలతో సంబంధాలు కలిగి ఉన్న కేసులో అరెస్టు అయిన సాయిబాబాను రిలీజ్ చేయాలని శుక్రవారం బాంబే హైకోర్టుకు
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా(Professor Saibaba) రిలీజ్పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. మావోలతో సంబంధాలు కలిగి ఉన్న కేసులో అరెస్టు అయిన సాయిబాబాను రిలీజ్ చేయాలని శుక్రవారం బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు ఇతర వ్యక్తుల రిలీజ్ను సుప్రీం నిలిపివేసింది.
హైకోర్టు తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది. డిసెంబర్ 8వ తేదీన మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం తెలిపింది. జస్టిస్ ఎంఆర్ షా, బెలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. మావోలతో లింకున్న కేసులో సాయిబాబా నిర్దోషి అని నాగపూర్ బెంచ్ తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును క్రిమినల్ ప్రొసిజర్లోని 390 కోడ్ ప్రకారం వ్యతిరేకిస్తున్నట్లు సుప్రీం బెంచ్ తెలిపింది.
మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అభియోగాలతో 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. అత్యంత కఠినమైన యూఏపీఏ చట్టం కింద సాయిబాబాపై అభియోగాలు మోపటంతో ఆయనకు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. దీనిని హైకోర్టులో సాయిబాబా సవాల్ చేశారు. పిటిషన్ను విచారించిన జస్టిస్ రోహిత్ దేవ్, జస్టిస్ అనిల్ పన్సారేతో కూడిన నాగపూర్ బెంచ్, జీవిత ఖైదు శిక్షను రద్దుచేస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

