Priyanka Gandhi | రాహుల్ గాంధీ హిందువులను అమానించలేదు : ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం తన లోక్‌సభ ప్రసంగంలో ఎక్కడా హిందువులను అవమానించలేదని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.
Priyanka Gandhi : విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం తన లోక్‌సభ ప్రసంగంలో ఎక్కడా హిందువులను అవమానించలేదని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ హిందువులను అవమానించలేదని పేర్కొన్నారు. తాను బీజేపీతో పాటు ఆ పార్టీ నేతల తీరు గురించే మాట్లాడానని రాహుల్ స్పష్టంగా చెప్పారని ఆమె గుర్తుచేశారు. పార్లమెంట్ వెలుపల ప్రియాంక గాంధీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగంపై దాడి జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తాను మరో అంశం గమనించానని, ధైర్యం గురించి మాట్లాడేది కేవలం ఒక మతం కాదు. అన్ని మతాలు ధైర్యం గురించి మాట్లాడతాయని అన్నారు.
అధికారం, సంపద కేంద్రీకరణ, పేదలు, దళితులపై దమనకాండ గురించి ప్రశ్నించిన వారిని అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, రైతుల సమస్యలు కేంద్రానికి పట్టవని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు తాము పోరాడుతున్నామని అన్నారు. ఇండియా కూటమి నేతలను ప్రభుత్వ ప్రోద్భలంతో ఈడీ, సీబీఐ వేధిస్తున్నాయని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి విపక్ష నేతలను వేధిస్తూ వారిని జైల్లో పెట్టి హింసిస్తున్నారని అన్నారు.
శివుడి ఫొటోను చూపుతూ తాను శివుడి నుంచి ప్రేరణ పొందానని అన్నారు. శివుడి ఫొటోను, రాజ్యాంగ ప్రతిని సభలో చూపడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. కేంద్రం ఆదేశాలతో తనను టార్గెట్ చేశారని దయ్యబట్టారు. నా సభ్యత్వాన్ని రద్దు చేసి, ఎంపీ పదవినీ, ఇంటినీ లాక్కున్నారని అన్నారు. విపక్షంలో ఉన్నందుకు గర్వపడుతున్నామని అన్నారు. ఓ సినిమాతో మహాత్మా గాంధీ అంటే ప్రపంచానికి తెలిసిందని ప్రధాని మోదీ అన్నారని, ఆయన అజ్ఞానాన్ని అర్ధం చేసుకున్నారా అని ప్రశ్నించారు.
Read More :
KTR | కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ విజృంభిస్తాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

