Priyanka Gandhi | వాయనాడ్‌లో మహిళా సాధికారత ప్రాజెక్టులకు ప్రియాంకాగాంధీ శంకుస్థాపన
Priyanka Gandhi | కేరళ (Kerala) లోని వాయనాడ్ జిల్లా (Wayanad district) లో పలు మహిళా సాధికారత ప్రాజెక్టుల (Women led projects) కు శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు మహిళల నేతృత్వంలో పనిచేస్తాయని చెప్పారు.
Priyanka Gandhi : కేరళ (Kerala) లోని వాయనాడ్ జిల్లా (Wayanad district) లో పలు మహిళా సాధికారత ప్రాజెక్టుల (Women led projects) కు శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు మహిళల నేతృత్వంలో పనిచేస్తాయని చెప్పారు. వాయనాడ్ జిల్లాలోని తన్విన్హాల్ గ్రామ పంచాయతీ (Thanvinhal Gram Panchayat) లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రియాంకాగాంధీ మాట్లాడుతూ.. ఇవాళ నేను ఆధునిక అంగన్వాడీ కేంద్రమైన ‘టేక్ ఎ బ్రేక్ సెంటర్’కు శంకుస్థాపన చేశానని, ఇది పర్యాటకులకు విశ్రాంతి కేంద్రంగా, వినోద కేంద్రంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ కేంద్రాన్ని మహిళా సంఘాల మహిళలు ఆపరేట్ చేస్తారని తెలిపారు. ఈ కేంద్రంలో కెఫటేరియా, పార్కు ఉన్నాయని, అవి కూడా మహిళల నేతృత్వంలోనే కొనసాగుతాయని అన్నారు. ఈ కేంద్రాన్ని మహిళలు నడుపడం అద్భుతంగా ఉంటుందని చెప్పారు.
పురుషులు తరచూ మహిళల శక్తిని తక్కువ అంచనా వేస్తుంటారని, కానీ మనం తలుచుకుంటే ఏదైనా చేయగలమని గ్రామానికి చెందిన మహిళలను ఉద్దేశించి ప్రియాంకాగాంధీ వ్యాఖ్యానించారు. ఇంటిని, కుటుంబాన్ని మనం అద్భుతంగా నడుపుతున్నామని, మనం ఏ పనిచేసినా, అది కార్యాలయంలో అయినా, వ్యాపారంలో అయినా అంకితభావంతో చేస్తామని చెప్పారు. తన్విహాల్ పంచాయతీ ఏరియా మంచి పర్యాటక ప్రాంతమని, ఈ ఏరియాలో సహజ అందాలు అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటి ఏరియాలో మహిళకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

