President’s Rule | ఆరేండ్ల తర్వాత.. జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమయింది. ఆరేండ్ల తర్వాత రాష్ట్రపతి పాలన (President's Rule) ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీనిపై రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమయింది. ఆరేండ్ల తర్వాత రాష్ట్రపతి పాలన (President’s Rule) ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీనిపై రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. అది వెంటనే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. పదేండ్ల తర్వాత జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
కాగా, జమ్ముకశ్మీర్‌లో 2018లో బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో శాసన సభను రద్దు చేసి, ఆరు నెలలపాటు గవర్నర్ పాలన విధించారు. అది ముగియడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధించింది. 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ సమయంలో అక్కడ జరిగిన పరిణామాల, భద్రతాపరమైన కారణాలవల్ల 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు అక్కడ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం వెనకడుగు వేసింది. దీంతో 2019 అక్టోబర్ 31న రాష్ట్రపాతి పాలనను పొడిగిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అది ఇప్పటి వరకు కొనసాగుతున్నది. కాగా, 90 స్థానాలున్న జమ్ము కశ్మీర్లో అసెంబ్లీలో ఎన్సీ- కాంగ్రెస్ కూటమికి 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. బీజేపీ 29 స్థానాల్లో విజయం సాధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

