ముగిసిన రాష్ట్రపతి ఎన్నికలు… పార్లమెంట్లో 99.18 శాతం ఓటింగ్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. పార్లమెంట్లో 99.18 శాతం ఓటింగ్ నమోదైనట్లు చీఫ్ రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ తెలిపారు. పార్లమెంటులో ఓటు వేసేందుకు భారత ఎన్నికల కమిషనర్ అనుమతించిన 736 మంది ఓటర్లలో (727 మంది ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు) 730 మంది (721 ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు) ఓటు వేసినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా అసెంబ్లీల నుంచి బ్యాలెట్ బాక్సులను ఈ రాత్రి కల్లా ఢిల్లీలోని పార్లమెంట్‌కు తరలిస్తామని వెల్లడించారు. మరోవైపు బీజేపీ ఎంపీ సన్నీడియోల్తో సహా ఆరుగురు ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా, భారత 15వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పోటీ పడ్డారు. దేశ వ్యాప్తంగా ఎన్నికైన సుమారు 4,800 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. జూలై 21న పార్లమెంట్ హాల్లో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. గెలిచిన అభ్యర్థి జూలై 25న తదుపరి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

