న్యూఢిల్లీ: ఇవాళ బుద్ద పూర్ణిమ(Buddha Purnima). ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బుద్దుడి బోధనలు శాంతి, అహింస, జ్ఞానాన్ని బోధిస్తాయన్నారు. మానవళికి ఆయన బోధనలు మార్గాన్ని చూపాయన్నారు. రాష్ట్రపతి ముర్ము తన ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. బుద్దపూర్ణిమ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నాని, పౌరులందరికీ, బుద్ధ భగవానుడి ఫాలోవర్లకు బెస్ట్ విషెస్ అని ఆమె పేర్కొన్నారు. బుద్ద భగవానుడు ఈనేలపై అవతరించిన రోజు అని, దయ..కరుణ, శాంతి, అహింస లాంటి ఆయన బోధనలు మానవాళికి మార్గదర్శనం చేస్తాయన్నారు. నేటి సమాజం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, అయితే బుద్దుడి బోధనలతో ఆ సమస్యలను అధిగమించవచ్చు అన్నారు. బుద్దుడి ఆశయాలను, ఆదర్శాలను స్వీకరించి శాంతియుత, సమగ్ర సమాజ నిర్మాణానికి సహకరించాలని ముర్ము కోరారు.
On the auspicious occasion of Buddha Purnima, I extend my heartfelt greetings and best wishes to all citizens and to the followers of Bhagwan Buddha across the world. pic.twitter.com/RRUDWvtj4V
— President of India (@rashtrapatibhvn) May 1, 2026
ప్రధాని మోదీ కూడా ప్రజలకు బుద్దపూర్ణిమ విషెస్ తెలిపారు. బుద్ద భగవానుడి ఆదర్శాలకు బలంగా కట్టుబడి ఉన్నామన్నారు. పవిత్రమైన బుద్ధ పౌర్ణమి సందర్భంగా తోటి పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. శాంతి, కరుణ, సామరస్య మార్గంలో నడవడానికి మనకు స్ఫూర్తినిచ్చే ఈ పవిత్రమైన రోజున, బుద్ధ భగవానుడి జీవితంలో నిక్షిప్తమైన విలువలను స్వీకరించాలనే మన సంకల్పాన్ని పునరుద్ఘాటిద్దామని ప్రధాని మోదీ తన పోస్టులో తెలిపారు.
सभी देशवासियों को बुद्ध पूर्णिमा की असीम शुभकामनाएं। शांति, करुणा और सद्भावना के मार्ग पर चलने की प्रेरणा देने वाले इस पावन अवसर पर आइए, भगवान बुद्ध के जीवन मूल्यों को अपनाने का संकल्प दोहराएं।
नान्तर्बहिश्च लोकेषु त्वात्मानं दृष्टवान् क्वचित्।
आष्टाङ्गिकेन मार्गेण परमां… pic.twitter.com/DrTeabrw93
— Narendra Modi (@narendramodi) May 1, 2026
హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసం పూర్ణిమ రోజున బుద్ద పూర్ణిమ జరుపుకుంటారు. సిద్ధార్ధ గౌతముడు పుట్టిన రోజు ఇది. ఆ తర్వాత ఆయనే బౌద్ధ భగవానుడు అయ్యాడు. క్రీస్తు పూర్వం అయిదో శతాబ్ధంలో నేపాల్‌లోని లుంబిని ప్రాంతంలో ఆయన జన్మించారు. సిద్ధార్థ గౌతముడు ఈ రోజునే నిర్వాణాన్ని పొందారు. బోద్ గయాలోని బోధి వృక్షం కింద తపస్సు చేసి ఆయన బుద్దుడిగా మారారు.