17వ లోక్‌సభ రద్దు
ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుత లోక్‌సభ రద్దయ్యింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. జూన్ 16 వరకు గడువు ఉన్న ఈ లోక్‌సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని రాష్ట్రపతికి సిఫార్సు చేసింది.
- కేబినెట్ సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం
- ప్రధాని పదవికి మోదీ రాజీనామా
- ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగింపు
న్యూఢిల్లీ, జూన్ 5: ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుత లోక్‌సభ రద్దయ్యింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. జూన్ 16 వరకు గడువు ఉన్న ఈ లోక్‌సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో 17వ లోక్‌సభ రద్దయ్యింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన చేసింది. దీంతో కొత్త లోక్‌సభ కొలువుదీరడానికి ప్రక్రియ మొదలైంది.
ప్రధాని పదవికి మోదీ రాజీనామా
మరోవైపు ప్రధాని మోదీ సహా, కేంద్ర మంత్రివర్గ సభ్యులంతా బుధవారం తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని మోదీ కలిసి రాజీనామా లేఖను అందజేయగా ఆమె వెంటనే ఆమోదం తెలిపారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మోదీని రాష్ట్రపతి కోరినట్టు రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

