Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
Regime Change: దేశంలో అధికార మార్పిడి జరగాలని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. ప్రభుత్వం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో నేరం కాదు అని, ఇప్పుడు పోరాటం అంతా అధికార మార్పిడి కోసమే అని ఆయన తెలిపారు. ఆ వ్యాఖ్యలను కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్ దీప్కే వ్యతిరేకించారు. తాము కేవలం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపు కోరుతున్నట్లు చెప్పారు.
న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తన పదవి నుంచి తొలగించాలని సీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. ఆ సమయంలో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ అధికార మార్పిడి కూడా జరగాలన్నారు. ఆ సమావేశంలో ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నేత నేహా బోరా, కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో నేరం కాదు అని, ఇప్పుడు పోరాటం అంతా అధికార మార్పిడి కోసమే అని ప్రశాంత్ భూషణ్ అన్నారు. అధికార మార్పిడి కోసం విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని ప్రభుత్వం అంటోందని, కానీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని తాము పోరాటం చేస్తున్నామని, ఒకవేళ ఇదే తరహా క్రూరత్వం కొనసాగితే, అప్పుడు తప్పకుండా అధికార మార్పిడి జరుగుతుందని, అవును మా అందరికీ ప్రభుత్వం మారాలని ఉందని ఆయన అన్నారు. అధికార మార్పిడి కోసం బీజేపీ కూడా ఎన్నో ఉద్యమాలు చేపట్టిందని, కానీ ఇప్పుడు కుట్ర జరుగుతున్నట్లు ఆ పార్టీ ఆరోపించడం సమంజసం కాదు అని ఆయన పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో ప్రశాంత్ భూషణ్ చేసిన అధికార మార్పిడి వ్యాఖ్యలను కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే తప్పుపట్టారు. తాము చేస్తున్న నిరసనలు కేవలం సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించడం కోసమే అని దీప్కే అన్నారు. అధికార, ప్రభుత్వ మార్పిడి తమ ఉద్దేశం కాదు అని తెలిపారు. అధికార మార్పిడి జరగాలని తాము చెప్పడం లేదని, ఆ దిశగా పనిచేయడం లేదని, సీఈసీ ఎన్నికలను రిగ్గింగ్ చేస్తున్నారని, తన తోటి ఎన్నికల కమీషనర్లను ఆయన పట్టించుకోవడం లేదని, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా వినడం లేదని, ప్రస్తుతం సీఈసీని తొలగించి, నిష్పక్షపాతంగా కొత్త సీఈసీని నియమించాలని దీప్కే అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Garividi Lakshmi | ఓటీటీలోకి గరివిడి లక్ష్మి బయోపిక్.. రేపటి నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
HMDA | భూములను అమ్మడమే రేవంత్ రెడ్డి ప్రజాపాలన? : ఎమ్మెల్యే కృష్ణారావు
Aakasamlo Oka Tara | బాక్సాఫీస్ వద్ద దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ జోరు.. మంగళవారం కూడా అదిరిపోయే వసూళ్లు!
సూర్యాపేటలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
Miss Universe | విశ్వసుందరిగా ప్యూర్టో రికో భామ.. మిస్ యూనివర్స్ 2026 విజేతగా నిలిచిన జెన్నిఫర్ బారెటో
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

