Prahlad Joshi | ‘అవును మేం చక్రవ్యూహం నిర్మించాం’.. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కౌంటర్
Prahlad Joshi | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు హాని తలపెట్టేలా చక్రవ్యూహాన్ని నిర్మించిందని, ఆ చక్రవ్యూహాన్ని తాము ఛేదిస్తామని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్ ఇచ్చారు.
Prahlad Joshi : బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు హాని తలపెట్టేలా చక్రవ్యూహాన్ని నిర్మించిందని, ఆ చక్రవ్యూహాన్ని తాము ఛేదిస్తామని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్ ఇచ్చారు. అవును రాహుల్‌గాంధీ చెప్పినట్లుగానే తాము చక్రవ్యూహం నిర్మించామని ఆయన అన్నారు. అయితే రాహుల్ ఆరోపించినట్లుగా తమది ప్రజలకు హానిచేసే చక్రవ్యూహం కాదని, కాంగ్రెస్ పార్టీ అవినీతి, కుంభకోణాలను కట్టడిచేసే చక్రవ్యూహమని చెప్పారు.
తాము అవినీతిని ఏ మాత్రం సహించబోమని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. రాహుల్‌గాంధీ, ఆయన తల్లి సోనియాగాంధీ 10 ఏళ్లు రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడిపించారని, అప్పుడు కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు లేని కులగణన ప్రస్తావన ఇప్పుడు ఎందుకని, ఇదంతా ఒక డ్రామా అని జోషి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లుగా చేసిన అవినీతిని, కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి రాహుల్‌గాంధీ డ్రామాలు ఆడుతున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు.
బడ్జెట్‌పై చర్చలో భాగంగా రాహుల్‌గాంధీ సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. అంబానీ, అదానీ లాంటి పెట్టుబడిదారులను.. ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను.. అధికార పీఠం కూలకుండా ఉండేందుకు అవసరమైన మిత్రపక్ష రాజకీయ పార్టీలను.. ప్రజాస్వామ్య విరుద్ధంగా మచ్చిక చేసుకుని కేంద్రం చక్ర వ్యూహం నిర్మించిందని ఆరోపించారు. ఆ చక్రవ్యూహాన్ని తాము ఛేదించి తీరుతామని సభలో శపథం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

