Chandrayaan-3 | చంద్రుడిపై రోవర్ రోమింగ్.. ఇస్రో తాజా వీడియో
Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3)కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నది. తాజాగా రోవర్ ప్రజ్ఞాన్ మూన్‌పై చక్కర్లు కొడుతున్న వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేసింది.
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3)కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నది. తాజాగా రోవర్ ప్రజ్ఞాన్ మూన్‌పై చక్కర్లు కొడుతున్న వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేసింది. చంద్రుడిపై వాక్ చేస్తున్న రోవర్ సురక్షిత మార్గాన్ని ఎంచుకుని ప్రయాణిస్తున్నది. ఈ క్రమంలో దాని ముందు గొయ్యి, రాళ్లు వంటివి ఉండటాన్ని గుర్తించినప్పుడు తిరిగి వెనక్కి మళ్లుతున్నది. ఇస్రో శాస్త్రవేత్తలు బెంగళూరులోని కమాండ్ సెంటర్ నుంచి రిమోట్‌గా రోవర్‌ను ఆపరేట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రుడి ఉపరితలంపై రోవర్ చక్కర్లు కొట్టడాన్ని విక్రమ్ ల్యాండర్ వీడియో తీసింది. ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో ఇస్రో పోస్ట్ చేసింది. ‘చందమామ పెరట్లో పిల్లవాడు (రోవర్) సరదాగా ఉల్లాసంగా ఆడుతుంటే అమ్మ (ల్యాండర్) ఆప్యాయంగా చూస్తున్నట్టుగా ఉంది కదా’ అని కామెంట్ చేసింది. విక్రమ్‌లోని ల్యాండర్ ఇమేజ్ కెమెరా ద్వారా ఈ వీడియోను చిత్రీకరించినట్లు ఇస్రో పేర్కొంది.
కాగా, చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ఆగస్ట్ 23న చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌గా ల్యాండ్ అయ్యింది. దీంతో అక్కడ తొలిసారి అడుగుపెట్టిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అనంతరం విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ కిందకు దిగింది. చంద్రుడి ఉపరితలంపై మూన్ వాక్ చేస్తూ పరిశోధనలు చేస్తున్నది. చంద్రుడి దక్షిణ ధృవంపై సల్ఫర్ నిల్వలు ఉన్నట్లు రోవర్ ప్రజ్ఞాన్ నిర్ధారించింది. అలాగే విక్రమ్ ల్యాండర్‌ను ఫొటో కూడా తీసింది. దీనిని మిషన్ ఇమేజ్‌గా ఇస్రో అభివర్ణించింది. మరోవైపు వారం రోజుల్లో మూన్‌పై పరిశోధనలు ముగియనున్నాయి.
Chandrayaan-3 Mission:
The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera.It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately.
Isn't it?🙂 pic.twitter.com/w5FwFZzDMp— ISRO (@isro) August 31, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

