Watch: యూపీలో నాసిరకంగా కాలేజీ భవన నిర్మాణం… చేతితో తోస్తే పడిపోయే గోడలు
లక్నో: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ, వసతి భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే నాసిరకంగా ఉన్న నిర్మాణ పనులను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే బయటపెట్టారు. ఆయన చేతితో తోయగానే అక్కడి ఇటుక కట్టడాలు కూలిపోయాయి. యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాణిగంజ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, హాస్టల్ భవనాన్ని స్థానిక ఎస్పీ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్కే వర్మ గురువారం సందర్శించారు. నాణ్యత లేని నిర్మాణాన్ని పరిశీలించిన ఆయన షాక్ అయ్యారు.
ఇటుక రాళ్లతో కట్టిన పిల్లర్, గోడలను ఎస్పీ ఎమ్మెల్యే ఒంటి చేతితో నెట్టగానే అవి కూలిపోయాయి. ‘ఇదీ నాలుగంతస్తుల భవనం నాణ్యత’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఇలాంటి నాసిరకం నిర్మాణ పనులు యువత భవిష్యత్తును నిర్మించవు. ఇది వారి మరణానికి ఏర్పాట్లు చేయడం లాంటిది. రాణిగంజ్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వ అవినీతి యంత్రాంగానికి నిదర్శనం’ అని ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ‘బీజేపీ హయాంలో అవినీతి అద్భుతం. ఇంజినీరింగ్ కాలేజీ భవనాన్ని సిమెంట్ లేకుండా ఇటుకలతో నిర్మిస్తున్నారు’ అని విమర్శించారు.
ऐसे घटिया निर्माण कार्य से सरकार युवाओं का भविष्य नहीं तैयार रही,यह उनके मौत का इंतजाम है, रानीगंज विधानसभा में बन रहे इंजीनियरिंग कॉलेज में भ्रष्ट सरकारी तंत्र का दर्शन। pic.twitter.com/Rr6ibkN4l4
— Dr. R. K. Verma mla (@DrRKVermamla2) June 23, 2022
भाजपा के राज में, घोर भ्रष्टाचार का कमाल है निराला
बिन सीमेंट, इंजीनियर कॉलेज की ईंटों को जोड़ डाला pic.twitter.com/q2iqFyCELX— Akhilesh Yadav (@yadavakhilesh) June 24, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

