80 ముక్కలుగా వ్యక్తి అస్థిపంజరం.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు
గ్రామానికి చెందిన 31 ఏళ్ల యూనస్ అన్సారీ సోదరి, వికాస్ గిరి కలిసి ఉండగా తాము చూసినట్లు పోలీసులకు గ్రామస్తులు తెలిపారు. దీంతో అన్సారీని చాలాసార్లు ప్రశ్నించగా తనకేమీ తెలియదని అన్నాడు.
భోపాల్: అటవీ ప్రాంతంలో 80 ముక్కలుగా వ్యక్తి అస్థిపంజరం లభించింది. తొమ్మిది నెలలపాటు దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు హత్య మిస్టరీని ఛేదించారు. ఒక నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చుయియా గ్రామానికి చెందిన 21 ఏళ్ల వికాస్ గిరి, 2021 అక్టోబర్‌లో అదృశ్యమయ్యాడు. దీంతో ఆ యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుధ్మునియా అడవి ప్రాంతంలో పశువులు మేపే కొందరు అక్కడ ఒక అస్థిపంజరం, ఆధార్ కార్డును గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి 80 ముక్కలున్న అస్థిపంజరాన్ని వెలికితీశారు. మృతుడు వికాస్ గిరిగా గుర్తించారు. అనంతరం ఆ యువకుడి హత్యపై దర్యాప్తు చేశారు.
కాగా, గ్రామానికి చెందిన 31 ఏళ్ల యూనస్ అన్సారీ సోదరి, వికాస్ గిరి కలిసి ఉండగా తాము చూసినట్లు పోలీసులకు గ్రామస్తులు తెలిపారు. దీంతో అన్సారీని చాలాసార్లు ప్రశ్నించగా తనకేమీ తెలియదని అన్నాడు. అయితే మరికొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ నెల 4న అన్సారీని అదుపులోకి తీసుకుని క్రాస్‌ఎగ్జామ్ చేశారు. దీంతో హత్య గుట్టు విప్పాడు. తన సోదరిని గిరి వేధిస్తున్నాడని, తమ ఇంటి వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపాడు. రాడ్‌తో కొట్టగా అతడు చనిపోయినట్లు చెప్పాడు. అనంతరం మృతదేహాన్ని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పాతిపెట్టినట్లు వెల్లడించాడు.
ఈ నేపథ్యంలో అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడైన అతడి బంధువు సిర్తాజ్ మహ్మద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మృతుడు వికాస్ గిరి, అన్సారీ మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, ఈ క్రమంలో అన్సారీ సోదరితో అతడికి పరిచయం ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

