PAK Spy Network | యూట్యూబర్.. గార్డ్.. స్టూడెంట్.. బట్టబయలవుతున్న పాకిస్థాన్ స్పై నెట్వర్క్!
పాకిస్థాన్‌కు గూఢచారులుగా వ్యవహరించారనే ఆరోపణలపై పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి గత రెండు వారాలలో ఓ మహిళా యూట్యూబర్తోసహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పాక్ గూఢచర్య వ్యవస్థలో భాగంగా వీరు ఉత్తరాదిలో కార్యకలాపాలు సాగిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్‌ని ఈ ఇద్దరు మహిళలు కలుసుకున్నారు. గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణపై డానిష్‌ని భారత ప్రభుత్వం మే 13న దేశం నుంచి బహిష్కరించింది.
- ఇప్పటివరకు 12 మంది గూఢచారుల అరెస్టు
- కీలక సైనిక సమాచారం ఐఎస్ఐకి చేరవేత
PAK Spy Network | లక్నో: పాకిస్థాన్‌కు గూఢచారులుగా వ్యవహరించారనే ఆరోపణలపై పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి గత రెండు వారాలలో ఓ మహిళా యూట్యూబర్తోసహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పాక్ గూఢచర్య వ్యవస్థలో భాగంగా వీరు ఉత్తరాదిలో కార్యకలాపాలు సాగిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్‌ని ఈ ఇద్దరు మహిళలు కలుసుకున్నారు. గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణపై డానిష్‌ని భారత ప్రభుత్వం మే 13న దేశం నుంచి బహిష్కరించింది. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్(పీఐఓలు)కి నిందితులంతా కీలకమైన సమాచారాన్ని చేరవేసినట్లు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో వెల్లడైందని అధికారులు సోమవారం తెలిపారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, వారి ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతున్నదని వారు చెప్పారు.
ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్
పంజాబ్, హర్యానా నుంచి జరిగిన అరెస్టులతోపాటు పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఏజెంట్ ఒకరిని ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో రాష్ట్ర ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. మే 4న ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల ఫొటోలను ఐఎస్ఐకి చేరవేశారన్న ఆరోపణలపై అమృత్‌సర్‌లోని అజ్నాలాకు చెందిన ఫలక్షేర్ మాసీహ్, సూరజ్ మాసీ అనే ఇద్దరు వ్యక్తులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. మే 11న డానిష్‌తో సంబంధాలు ఉన్న ఇద్దరు వ్యక్తులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను 31 ఏళ్ల గుజాలా అనే మహిళ, యమీన్ మొహమ్మద్‌గా గుర్తించారు. వీరిద్దరూ మలేర్కోట్ల వాసులు. రహస్య సమాచారాన్ని చేరవేసినందుకు వీరిద్దరికీ ఆన్లైన్లో డబ్బు ముట్టినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. తాను డబ్బు కోసమే ఈ పనిచేసినట్లు గుజాలా ఒప్పుకున్నట్లు అధికారులు చెప్పారు. భారతీయ సైన్యానికి చెందిన సమాచారాన్ని పంచుకున్నందుకు తనకు రూ.10,000, రూ. 20,000 యూపీఐ ద్వారా ముట్టినట్లు ఆమె అంగీకరించినట్లు వారు తెలిపారు.
ఐఎస్ఐకి సైనిక కదలికలు
పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీరులోని కీలక వ్యూహాత్మక ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని, సైనిక కదలికలను ఐఎస్ఐకి చేరవేసినట్లు సమాచారం అందడంతో మే 15న సుఖ్‌ప్రీత్ సింగ్, కరణ్‌బీర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ సోమవారం వెల్లడించారు. హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఓ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నౌమాన్ ఇలాహీని పాక్‌లోని కొందరు వ్యక్తులకు కీలక సమాచారాన్ని సరఫరా చేస్తున్నాడన్న ఆరోపణపై హర్యానా పోలీసులు మే 15న అరెస్టు చేశారు. మరుసటి రోజే కైథల్‌లో ఓ 25 ఏళ్ల పీజీ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో తుపాకులు, రివాల్వర్ల ఫొటోలను అప్లోడ్ చేసినందుకు దేవేందర్ సింగ్ అనే విద్యార్థిని అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

