సిద్ధరామయ్య భార్యపై పోలీసులకు ఫిర్యాదు
కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూకుంభకోణం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈ స్కామ్‌కు సంబంధించి సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున్, మరో వ్యక్తిపై స్నేహమయి కృష్ణ అనే సామాజిక కార్యకర్త మైసూర్‌లోని విజయనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- ఫోర్జరీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు
బెంగళూరు, జూలై 10: కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూకుంభకోణం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈ స్కామ్‌కు సంబంధించి సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున్, మరో వ్యక్తిపై స్నేహమయి కృష్ణ అనే సామాజిక కార్యకర్త మైసూర్‌లోని విజయనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య, పార్వతి, ముడా అధికారులతోపాటు మైసూర్ జిల్లా కలెక్టర్, పలువురు ఇతర ప్రభుత్వ అధికారులకు భూ కేటాయింపు కుంభకోణంలో పాత్ర ఉన్నదని ఆరోపించారు. ఇందుకు రెవెన్యూ, ఇతర అధికారులు సహకరించారని ఆరోపించారు. భూ కేటాయింపు వివాదంపై దర్యాప్తు చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ కార్యదర్శిలకు కూడా స్నేహమయి కృష్ణ లేఖ రాశారు. అయితే ఈ భూ కేటాయింపులు బీజేపీ హయాంలోనే జరిగాయని సీఎం సిద్ధరామయ్య అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

