మైసూరు: కర్ణాటక రాష్ట్రం చామరాజనగ రలోని మలమహదేశ్వర కొండలో ఆడ పులి, నాలుగు పులి పిల్లలు మృతి చెందిన ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పులి దాడిలో తమ ఆవు మృతి చెందిందనే కోపంతో మాదరాజు, కోనప్ప, నాగరాజు కలిసి అటవీ ప్రాంతంలో బుధవారం విషాహారం పెట్టారని పోలీసులు తెలిపారు. ఆ ఆహారాన్ని తిన్న ఆడపులి, నాలుగు పిల్లలు మృతి చెందాయి. విషాహారం తినే ఆడపుల్లి, నాలుగు పిల్లలు చనిపోయాయని అధికారులు తేల్చారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.