PM Modi | ముగిసిన పీఎం ధ్యానం.. కవి తిరువళ్లూవార్కు నివాళి
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ ధాన్యం ముగిసింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌లో ప్రధాని గత 45 గంటల పాటు ధాన్యం చేశారు. ఈ నెల 30 నుంచి శనివారం వరకు ఆయన మూడురోజుల పాటు ధాన్య మండపంలోనే గడిపారు.
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం ముగిసింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌లో ప్రధాని గత 45 గంటల పాటు ధ్యానం చేశారు. ఈ నెల 30 నుంచి శనివారం వరకు ఆయన మూడురోజుల పాటు ధాన్య మండపంలోనే గడిపారు. ధాన్యం అనంతరం ప్రధాని రాక్ మెమోరియల్‌లో తమిళ కవి తిరువళ్లూవార్కు నివాళులు అర్పించారు. ప్రధాని ధాన్య సమయంలో కేవలం ద్రాక్ష రసం, టెంకాయ నీళ్లు మాత్రమే సేవించారు. గురువారం సాయంత్రం ఆరుగంటల సమయంలో మోదీ ధ్యానం ప్రారంభమైంది.
అంతకు ముందు కన్యాకుమారి భగవతీ అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి చేశారు. ధ్యానం ముగింపు సందర్భంగా తిరువళ్లవార్ విగ్రహం పాదాలకు నమస్కరించి.. పూలమాల వేశారు. ఇదిలా ఉండగా.. మార్చి 16న కన్యాకుమారి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని.. 75 రోజల్లో 183 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో ఎన్నికల సభలు, రోడ్షోలున్నాయి. అదే సమయంలో ప్రధాని మోదీ వివిధ మీడియా సంస్థలకు దాదాపు 80 ఇంటర్వ్యూలు సైతం ఇచ్చారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించారు.
అయితే, ప్రధాని ధ్యానంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురావ్వొద్దన్నారు. రాజకీయాలు, మతం వేర్వేరన్నారు. కన్యాకుమారిలో ప్రధాని డ్రామా చేస్తున్నారని.. అక్కడ దాదాపు 10వేల మందిని మోహరించారని.. దాంతో దేశ ధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. దేశంలో ప్రవర్తనా నియమావళి అమలులో ఉందని.. దీనికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? అంటూ ప్రశ్నించారు. అంత విశ్వాసం ఉంటే.. మీ ఇంట్లో నుంచే ఈ పని చేయాలని.. సొంత జేబులో నుంచి ఖర్చు చేయాలన్నారు.
#WATCH प्रधानमंत्री मोदी ने तमिलनाडु के कन्याकुमारी में विवेकानंद रॉक मेमोरियल में अपने दो दिवसीय ध्यान का समापन किया। pic.twitter.com/Js93hZDj3C
— ANI_HindiNews (@AHindinews) June 1, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

