Rajasthan Polls | యువత, విద్యార్ధుల కలలను భగ్నం చేసిన కాంగ్రెస్ : మోదీ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం అధికారంలో ఉంటే అది సమాజానికి అంత హాని తలపెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్ధాన్‌లోని (Rajasthan Polls) కోటాలో మంగళవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.
జైపూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం అధికారంలో ఉంటే అది సమాజానికి అంత హాని తలపెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్ధాన్‌లోని (Rajasthan Polls) కోటాలో మంగళవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు.
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ర్యాలీకి పూర్తి భద్రత కల్పించారని ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్ బాధ్యులని తాము జైలుకు పంపుతామని, ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యార్ధులు శిక్షణ కోసం కోటాకు వస్తారని, విద్యార్ధులు, యువత కలలను కాంగ్రెస్ చిదిమేసిందని దుయ్యబట్టారు.
రాజస్ధాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు. అశోక్ గెహ్లాట్ మాయాజాలం రాజస్ధాన్ ప్రజల శక్తి ముందు పనిచేయదని స్పష్టం చేశారు. డిసెంబర్ 3న రాజస్ధాన్ నుంచి కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని ప్రధాని పేర్కొన్నారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. రాజస్ధాన్ యువత కాంగ్రెస్ నుంచి స్వేచ్ఛ కావాలని కోరుతున్నారన్నారు.
Read More :
Jairam Ramesh | ప్రపంచంలో పొరపాటున కూడా నిజాలు మాట్లాడని ఏకైక ప్రధాని నరేంద్రమోదీ: జైరామ్ రమేశ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

