Jairam Ramesh | ప్రపంచంలో పొరపాటున కూడా నిజాలు మాట్లాడని ఏకైక ప్రధాని నరేంద్రమోదీ: జైరామ్ రమేశ్
Jairam Ramesh | రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం రసవత్తరంగా మారింది.
జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ప్రధాని నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
ప్రైమ్ మినిస్టర్ జూట్ బోలో యోజన
రాజస్థాన్‌లో గత ఐదేండ్లుగా తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని తాము ప్రజలను కోరుతున్నామని, బీజేపీ నేతలు మాత్రం విద్వేష ప్రసంగాలు, అసత్యపు ప్రచారంతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నదని జైరామ్ రమేశ్ ఆరోపించారు. ఈ ప్రపంచంలో పొరపాటున కూడా నిజాలు మాట్లాడని ఏకైక ప్రధాని నరేంద్రమోదీ అని విమర్శించారు. గడిచిన పదేళ్లలో నరేంద్రమోదీ తీసుకొచ్చిన అతిపెద్ద పథకం పేరు ‘ప్రైమ్ మినిస్టర్ జూట్ బోలో యోజన’ అని ఆయన మండిపడ్డారు.
తాము రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తున్నామని, మళ్లీ గెలిపిస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 భృతి చెల్లిస్తామని చెబుతున్నామని జైరామ్ రమేశ్ తెలిపారు. ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలు మాత్రం రాజస్థాన్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అసత్యపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్లో, ఉత్తరప్రదేశ్‌లో, మధ్యప్రదేశ్‌లో అత్యాచారాలు జరగడం లేదా..? అని ప్రశ్నించారు.
ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు జరగుతుంటాయని, కానీ కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నట్టు మాట్లాడం కరెక్టు కాదని జైరామ్ రమేశ్ చెప్పారు. బీజేపీ నేతల అబద్ధపు ప్రచారంతో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెడ్డపేరు రావడం లేదని, రాజస్థాన్ రాష్ట్రానికి కూడా చెడ్డ పేరు వస్తున్నదని మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

