ఉచిత రేషన్‌తో లక్షలాది కుటుంబాలకు లబ్ధి : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఉచిత రేషన్ లక్షలాది కుటుంబాలకు ఆసరాగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) లబ్ధిదారులతో ప్రధాని మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఇబ్బందులు పడిన ప్రజలకు అన్ని విదాలుగా సాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. పీఎంజీకేఏవై పధకం పెద్దసంఖ్యలో ప్రజలకు ఉపయోగపడాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని చెప్పారు.
గోడౌన్లలో ఆహార ధాన్యాల నిల్వలు పెరుగుతున్నా మరోవైపు ఆకలి, పోషకాహారలోపం ఆ స్ధాయిలో తగ్గడం లేదని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సరైన పంపిణీ విదానం లేకపోవడమే దీనికి కారణమని చెప్పారు. అనర్హులైన లబ్ధిదారులను వ్యవస్ధ నుంచి తొలగించి రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేశామని తెలిపారు. పీఎంజీకేఏవై పధకం ఈ ఏడాది దీపావళి వరకూ అమల్లో ఉంటుందని, ఈ పధకం ద్వారా గుజరాత్లో 3.5 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

