PM Modi | మోదీకి బంగ్లా చీఫ్ యూనస్ ఫోన్.. హిందువులు, మైనారిటీల భద్రతకు కట్టుబడి ఉన్నామని హామీ
బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనార్టీల రక్షణ, భద్రతకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ భరోసా ఇచ్చారు.
PM Modi | న్యూఢిల్లీ, ఆగస్టు 16: బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనార్టీల రక్షణ, భద్రతకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం ఆయన ఫోన్ చేశారు. బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా దిగిపోయి తాత్కాలిక చీఫ్‌గా యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇద్దరూ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీల ప్రభుత్వానికి భారత ప్రభుత్వ సహకారం ఉంటుందని ఎక్స్‌లో చేసిన పోస్టులో నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
మహమ్మద్ యూనస్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ఇరువురం ప్రస్తుత పరిస్థితులపై భావాలు పంచుకున్నామని ఆయన చెప్పారు. బంగ్లాలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలుపగా, ఆ దేశంలో హిందువులు, ఇతర మైనారిటీల రక్షణ, భద్రతకు యూనస్ హామీ ఇచ్చారన్నారు.
బంగ్లాదేశ్‌లో విద్యార్థుల కొత్త పార్టీ?
ఆందోళనల ద్వారా దశాబ్దాల కాలంగా దేశాన్ని పాలిస్తున్న షేక్ హసీనా ప్రభుత్వాన్ని దింపేసిన బంగ్లాదేశ్‌లోని విద్యార్థులు కొత్త పార్టీని స్థాపించాలని అనుకుంటున్నారు. బంగ్లాలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలని దేశంలోని రెండు ప్రధాన పార్టీల డిమాండ్‌ను వారు వ్యతిరేకించడమే కాక, తమ ప్రగతిశీల భావాలకు అనుకూలంగా పాలన జరగాలంటే తామే అధికారంలోకి రావాలని భావిస్తు న్నారు.
కాగా, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాపై విధిస్తున్న అధిక ఒత్తిడిని నిలిపివేయాలని భారత ప్రభుత్వం అమెరికాకు విజ్ఞప్తి చేసింది. అయితే ఇదంతా విద్యార్థుల ఆందోళనకు తలొగ్గి హసీనా దేశం విడిచి పారిపోవడానికి ఏడాది ముందు జరిగిందని భారత్, అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

