న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఇవాళ. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ(PM Modi) పార్లమెంట్ ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ప్రగతిశీల సమాజం నిర్మాణం కోసం అంబేద్కర్ ఆశయాలు నిరంతరం ప్రేరణ కలిగిస్తాయని అన్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, స్పీకర్ ఓం బిర్లా కూడా నివాళి అర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కూడా ప్రేరణా స్థల్ వద్ద నివాళి అర్పించారు. అయితే ఆ సమయంలో ప్రధాని మోదీతో పాటు ఖర్గే కూడా ఫోటోకు ఫోజు ఇచ్చారు. మోదీ, ఖర్గే.. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. మోదీ నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi and Congress national president Mallikarjun Kharge share a light-hearted moment
PM Modi and other leaders paid tribute to Bharat Ratna Dr BR Ambedkar at Prerna Sthal in the parliament premises on the occasion of Ambedkar Jayanti.… https://t.co/JoquMq3m4d pic.twitter.com/vN3KkG63j1
— ANI (@ANI) April 14, 2026
ఇవాళ ఉదయం తన ఎక్స్ అకౌంట్లో మోదీ ఓ ట్వీట్ చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతి నిర్మాణం కోసం ఆయన చేసిన కృషి ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నట్లు చెప్పారు. ప్రగతిశీల సమాజ నిర్మాణం కోసం ఆయన జీవితం ఎప్పుడూ అందరికీ ఆదర్శంగా ఉంటుందన్నారు.
Tributes to Dr. Babasaheb Ambedkar on his birth anniversary. His efforts towards nation building are deeply motivating. His life and work continue to inspire generations to build a just and progressive society. pic.twitter.com/MWHUTlpf9Y
— Narendra Modi (@narendramodi) April 14, 2026