NITI Aayog | ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ ప్రారంభం.. పలు రాష్ట్రాల సీఎంలు గైర్హాజరు
NITI Aayog | ఢిల్లీలో నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన 9వ పాలక మండలి భేటీ అయ్యింది.
NITI Aayog | ఢిల్లీలో నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన 9వ పాలక మండలి భేటీ అయ్యింది. ఈ భేటీకి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేసేందుకు ‘వికసిత్ భారత్@2047’పై ప్రధానంగా చర్చిస్తున్నారు.
ఇక ఈ భేటీని విపక్ష పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు బాయ్‌కాట్ చేశారు (Opposition chief ministers skip). ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై వివక్ష చూపిందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా దక్షిణాది రాష్ర్టాలపై మోదీ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపుల తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని పలువురు సీఎంలు బహిష్కరించారు. వీరిలో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ సీఎంలు ఎంకే స్టాలిన్, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, భగవంత్ మాన్, సుఖ్విందర్ సింగ్ సుఖు ఉన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కూడా భేటీకి గైర్హాజరయ్యే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తాను నీతి ఆయోగ్ భేటీకి హాజరు కాలేనని కేరళ సీఎం విజయన్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు.
ఈ భేటీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. అయితే, నీతి ఆయోగ్‌ను రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని మళ్లీ ఉనికిలోకి తేవాలని దీదీ డిమాండ్ చేశారు. ‘వాళ్లు(బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ప్రజల మద్దతు లేదు. విపక్ష రాష్ర్టాలను మోసం చేసి రాజకీయ పక్షపాత బడ్జెట్‌ను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్‌కు ఆర్థిక అధికారాలు లేకపోయినా ఉమ్మడి వేదికపై గళాన్ని వినిపించడాన్ని నా బాధ్యతగా భావించాను’ అని ఆమె అన్నారు. ప్రణాళిక సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు సమస్యల పట్ల చర్చించే అధికారం ఉండేదన్నారు.
ఈ భేటీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం హాజరయ్యారు. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. వికసిత్ భారత్-2047లో భాగంగా వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనను ఏపీ సర్కార్ చేపట్టింది. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రస్తావించనున్నారు.
Also Read..
Encounter | జమ్మూ కశ్మీర్లో మరోసారి ఎదురుకాల్పులు.. జవాను మృతి..!
Kamala Harris | అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారు.. అధికారికంగా ప్రకటన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

