శిక్షణ కోసమే సీఎం కేజ్రీవాల్ దగ్గరికి అధికారులను పంపాను : సీఎం భగవంత్ మాన్
పంజాబ్ అధికారులతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశం కావడం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లేని సమయంలో కేజ్రీవాల్ పంజాబ్ విద్యుత్ అధికారులతో సమావేశమయ్యారు. దీనిపై ప్రతిపక్షాలు ఓ రేంజ్లో విరుచుకుపడ్డాయి. రిమోట్ కంట్రోల్ కేజ్రీవాల్ అంటూ ఫైర్ అయ్యాయి. ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తాజాగా స్పందించారు. తానే అధికారులను సీఎం కేజ్రీవాల్ వద్దకు పంపానని వివరణ ఇచ్చుకున్నారు. ట్రైనింగ్ విషయంలోనే తాను అధికారులను కేజ్రీవాల్ వద్దకు పంపామని తెలిపారు. అధికారులకు శిక్షణ అవసరమైతే ఎక్కడికైనా పంపాలి. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు ఇజ్రాయిల్‌కు కూడా పంపిస్తాను.విద్యుత్ రంగం, విద్యారంగంలో ఢిల్లీ మంచి రికార్డులు సాధించింది. అందుకే పంపాను. దీనికి అభ్యంతరం ఎందుకు? అంటూ సీఎం భగవంత్ మాన్ ప్రశ్నించారు.
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. పంజాబ్ విద్యుత్ అధికారులతో సీఎం కేజ్రీవాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లేని సమయంలో ఈ సమావేశం జరిగింది. దీంతో కేజ్రీవాల్‌పై ప్రతిపక్షాలు ఓ రేంజ్లో విరుచుకుపడ్డాయి. ఆయన ఓ రిమోట్ కంట్రోల్ అంటూ విరుచుకుపడ్డాయి. ఈ విషయంపై పీసీసీ మాజీ అధ్యక్షుడు సిద్దూ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం భగవంత్ మాన్ లేని సమయంలో సీఎం కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారు. దీనిని బట్టి అరవింద్ డీఫ్యాక్టో సీఎం అని తేలిపోయింది. ఢిల్లీ రిమోట్ కంట్రోల్ అని స్పష్టమైపోయింది. ఫెడరలిజాన్ని కేజ్రీవాల్ అవమానించారు. అటు సీఎం, ఇటు కేజ్రీవాల్ ఇద్దరూ దీనిపై వివరణ ఇవ్వాలి అని పీసీసీ మాజీ చీఫ్ సిద్దూ డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

