700 మంది రైతులు అమరులైతే.. ప్రభుత్వం డేటా లేదంటోంది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ లోక్‌సభలో మాట్లాడారు. కిసాన్ ఆందోళనలో 700 మంది రైతులు అమరులయ్యారన్నారు. దేశ రైతుల నుంచి ప్రధాని క్షమాపణలు కోరారు, కానీ ఆ అమర రైతుల డేటా ప్రభుత్వం దగ్గర లేదని ఆయన ఆరోపించారు. తప్పు చేసినట్లు ప్రధాని ఒప్పుకున్నారని, కానీ వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం ప్రాణాలు కోల్పోయిన రైతుల సమాచారం ఇవ్వడం లేదన్నారు. నవంబర్ 30వ తేదీన వ్యవసాయ మంత్రిని ప్రశ్నించగా.. తమ వద్ద మరణించిన రైతుల డేటా లేదని చెప్పినట్లు రాహుల్ తెలిపారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందని రాహుల్ అన్నారు. తన దగ్గర ఆ లిస్టు ఉందని, దాన్ని హౌజ్‌లో పెట్టామన్నారు. హర్యానాలోనూ అమర రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చిన లిస్టు కూడా సభలో పెట్టామన్నారు. ఇలాంటి సందర్భంలో రైతులు ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం ఎలా చెబుతుందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. క్షమాపణలు చెప్పిన ప్రధాని.. రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు.
పంజాబ్‌లో 400 మంది రైతులకు సుమారు 5 లక్షల పరిహారం ఇచ్చారన్నారు. 152 మందికి జాబ్స్ కూడా ఇచ్చారు. హర్యానాలో 70 మంది అమర రైతుల జాబితా తయారు చేశామన్నారు. రైతులకు వాళ్ల హక్కుల్ని ఇవ్వాలని, నష్టపరిహారంతో పాటు వాళ్లకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

