Arvind Kejriwal | కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలంటూ పిటిషన్.. భారీగా ఖర్చులు విధించాలన్న కోర్టు
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీఎం ప్రజలకు అందుబాటులో లేకపోవడం రాజ్యాంగ యంత్రాంగాన్ని క్లిష్టతరం చేస్తుందని తెలిపారు.
న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీఎం ప్రజలకు అందుబాటులో లేకపోవడం రాజ్యాంగ యంత్రాంగాన్ని క్లిష్టతరం చేస్తుందని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం సీఎం ఎప్పుడూ కూడా జైలు నుంచి విధులు నిర్వహించలేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
కాగా, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది. పబ్లిసిటీ కోసం ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని న్యాయమూర్తి విమర్శించారు. ఈ నేపథ్యంలో పిటిషనర్‌కు భారీగా ఖర్చులు విధించాలని ఆదేశించారు. ఇలాంటి పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విచారణకు లిస్ట్ చేయడంతోపాటు వాటిని తిరస్కరించినట్లు గుర్తుచేశారు. సందీప్ కుమార్ పిటిషన్ కూడా ఆ లిస్ట్‌లో చేర్చాలని సూచించారు. అలాగే పిటిషనర్‌కు భారీగా కోర్టు ఖర్చులు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

