న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కారు నెంబర్ ప్లేట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కారు నెంబర్లో ‘సీఏఏ’ అనే ఇంగ్లీష్ అక్షరాలు ఉండటమే ఇందుకు కారణం.
2019లో తెచ్చిన సీఏఏ ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం పొందేందుకు వీలుంది. అయితే, సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడంతో చట్టాన్ని అమలు చేయలేదు. పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చే లోగా సీఏఏ నోటిఫై చేయాలని కేంద్రం భావిస్తున్నది.