సోమవారం 30 మార్చి 2020
National - Feb 18, 2020 , 00:02:09

కశ్మీర్‌లో కార్మికుల సమ్మె

కశ్మీర్‌లో కార్మికుల సమ్మె
  • వేతన బకాయిల కోసం 11 రోజులుగా సమ్మెలో ఆరోగ్య సిబ్బంది

జమ్ము, ఫిబ్రవరి 17: జమ్ముకశ్మీర్‌ అంటే.. ని త్యం ఉగ్రవాదులు.. తీవ్రవాదుల దాడులు.. ఎన్‌కౌంటర్లు.. ఉద్రిక్త పరిస్థితులు..ఇవే కనిపిస్తుంటాయి.. వినిపిస్తుంటాయి. కానీ అక్కడ కూడా డిమాండ్ల సాధన కోసం కార్మికులు సమ్మె బాట పట్టారు. వివిధ డిమాండ్లను పరిష్కరించాలని జమ్ముకశ్మీర్‌లోని ప్రజా ఆరోగ్య ఇంజినీరింగ్‌ (పీహెచ్‌ఈ) శాఖలోని దినసరి కార్మికులు సమ్మె చేస్తున్నారు. వారి సమ్మె సోమవారానికి 11వ రోజుకు చేరుకున్నది. తమ పెండింగ్‌ వేతన బకాయిలు చెలించాలని, తమ సర్వీసులను క్రమబద్ధీకరించి, ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయాలని తదితర డిమాండ్లతో వారు సమ్మె చేస్తున్నారు. ఆందోళనకారులను ఉద్దేశించి సీపీఎం సీనియర్‌ నేత యూసుఫ్‌ తరిగామి మాట్లాడుతూ తమ పూర్తి మద్దతు ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి లెప్టినెంట్‌ గవర్నర్‌ జీఎస్‌ ముర్ము జోక్యం చేసుకోవాలన్నారు. logo