రెండో రోజూ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ: వినియోగదారులకు చుక్కలు చూపించిన పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను స్వల్పంగా తగ్గించాయి. నిన్న లీటర్ పెట్రోల్ 18 పైసలు, డీజిల్‌పై 17 పైసలు తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా దేశరాజధానిలో పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 20 పైసల చొప్పున తగ్గించాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.78, డీజిల్ రూ.81.10కి పడిపోయాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోల్ రూ.97.19, డీజిల్ రూ.88.20గా ఉన్నాయి. ఇక చెన్నైలో పెట్రోల్ రూ.92.77, డీజిల్ రూ.86.10, కోల్‌కతాలో రూ.90.98, డీజిల్ రూ.83.98, బెంగళూరులో పెట్రోల్ రూ.94.04, డీజిల్ రూ.86.21గా ఉంది.
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. నగరంలో లీటర్ పెట్రోల్ రూ.94.61, డీజిల్ రూ.88.67గా ఉన్నాయి. కరీంనగర్లో పెట్రోల్ రూ.94.48, డీజిల్ రూ.88.55 కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ నగరాలైన విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.24, డీజిల్ రూ.90.76గా ఉండగా, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.97.24, డీజిల్ రూ.90.76గా ఉంది.
గతేడాది మార్చి 16 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం తొలిసారిగా నిన్న (బుధవారం) తగ్గాయి. ఏడాది కాలంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. దేశంలో పెట్రోల్‌పై రూ.21.58, డీజిల్‌పై రూ.19.18 పెరిగాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

