Petrol Price | వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Price | వాహనదారులకు మళ్లీ షాక్.. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 90 పైసల చొప్పున రేట్లను పెంచింది. కాగా, ఇంధన ధరల పెంపు వారం రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.
Petrol Price | వాహనదారులకు మళ్లీ షాక్.. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 90 పైసల చొప్పున రేట్లను పెంచింది. కాగా, ఇంధన ధరల పెంపు వారం రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవల లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3వరకు పెంచిన సంగతి తెలిసిందే.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.98.64, డీజిల్ ధర రూ.91.58కు చేరింది. శుక్రవారం నాడే కేంద్ర ప్రభుత్వం లీటర్‌కు రూ.3 చొప్పున పెంచింది. దీంతో పెట్రోల్ రూ.94.77 నుంచి రూ.97.77, డీజిల్ రూ.87.67 నుంచి రూ.90.67కు పెరిగింది.
తాజా పెంపుతో ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.59, డీజిల్ రూ.94.08కు పెరిగింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.70, డీజిల్ రూ.96.07కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.49, డీజిల్ రూ.96.11కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌పై అత్యధికంగా 96 పైసల పెంపు నమోదైంది. దాని తర్వాత ముంబైలో పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 94 పైసలు పెరిగింది. చెన్నైలో పెట్రోల్‌పై 82 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెరిగాయి.
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకావం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

