Petrol Diesel Price | సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ సామాన్యులకు ఊరట కల్పించింది. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.2 చొప్పున తగ్గించింది. పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 చొప్పున తగ్గించడం ద్వారా కోట్లాది మంది భారతీయులు, వారి కుటుంబ సంక్షేమం, సౌలభ్యమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు.