కారులో ఇంధనం పోసుకొని.. బంక్ ఓనర్ కిడ్నాప్‌కు యత్నం..! వైరల్ వీడియో
Petrol Pump Owner | కారులో ఇంధనం పోయించుకొని పోయించుకొని.. అదే బంకు యజమానిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు నలుగురు దుండగులు. బంకు సిబ్బంది చొరవతో బంకు యజమాని కిడ్నాప్ నుంచి తృటిలో తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో
వారణాసి : కారులో ఇంధనం పోయించుకొని పోయించుకొని.. అదే బంకు యజమానిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు నలుగురు దుండగులు. బంకు సిబ్బంది చొరవతో బంకు యజమాని కిడ్నాప్ నుంచి తృటిలో తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకోగా.. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గురువారం రాత్రి శివపురిలోని తార్న ప్రాంతంలో చోటుచేసుకున్నది. ఎస్‌యూవీలో వచ్చిన నలుగురు.. వాహనంలో ఇంధనం నింపుకున్నారు. ఆ తర్వాత బంక్ యజమానిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు.
వీడియాలో ఓ వ్యక్తి పెట్రోల్ పంప్ యజమానితో వాదనకు దిగగా.. మరో ఇద్దరు వాహనంలో ఉన్న వ్యక్తి సైగలు చేశారు. దీంతో సదరు వ్యక్తి వాహనాన్ని తీసుకొని రాగా.. గొడవకు దిగిన వ్యక్తి వాహనం డోర్ తీసి.. బంకు యజమానిని అందులోకి నెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డుతో పాటు సిబ్బంది అడ్డుకున్నారు. ఆ తర్వాత వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గురించి, అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

