Ambareesh Murty | పెప్పర్ ఫ్రై సీఈవో అంబరీష్ మూర్తి మృతి
Ambareesh Murty | పెప్పర్ ఫ్రై సహ వ్యవస్థాపకుడు, సీఈవో (Pepperfry CEO ) అంబరీష్ మూర్తి (Ambareesh Murty) మృతి చెందారు.
Ambareesh Murty | పెప్పర్ ఫ్రై సహ వ్యవస్థాపకుడు, సీఈవో (Pepperfry CEO ) అంబరీష్ మూర్తి (Ambareesh Murty) మృతి చెందారు. సోమవారం రాత్రి గుండెపోటు (Cardiac Arrest)తో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన వయసు 51. ఈ విషయాన్ని సంస్థ మరో సహ వ్యవస్థాపకుడు ఆశిష్ షా (Ashish Shah ) ట్విట్టర్ ద్వారా (ఎక్స్) ధృవీకరించారు.
‘నా స్నేహితుడు, గురువు, సోదరుడు, ఆత్మ సహచరుడు అంబరీష్ మూర్తి ఇక లేరన్న విషయాన్ని
తెలియజేసేందుకు చాలా బాధపడుతున్నాను. నిన్న రాత్రి లెహ్ (Leh) లో గుండెపోటు కారణంగా ప్రాణాలు
కోల్పోయారు. దయచేసి అంబరీష్ కోసం, అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు బలం చేకూర్చాలని
ప్రార్థించండి’ అంటూ ఆశిష్ షా పేర్కొన్నారు.
అంబరీష్ మరణ వార్త విషయాన్ని తెలుసుకున్న పలువురు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు స్పందిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
Also Read..
Sherlyn Chopra | రాహుల్ గాంధీతో పెళ్లికి ఓకే.. అయితే ఓ షరతు : షెర్లిన్ చోప్రా
Ashok Gehlot | సీఎం పదవి నన్ను వదలడం లేదు : అశోక్ గెహ్లోత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

