ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాడు. రోజురోజుకూ తన నిర్ణయాలు కూడా మారుతుంటాయి. ఒక్క రోజులోనే ఎన్నో నిర్ణయాలు తీసుకునే మనిషి.. ఆ నిర్ణయాలను దేని ఆధారంగా తీసుకుంటారు. ఒక కన్‌క్లూజన్‌కు ఎలా వచ్చేస్తాడు. ఆ నిర్ణయం సరైనదేనా.. కాదా అని ఎలా ఫైనల్ చేసుకుంటాడు అనేదానిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే.. మనుషులు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం వెనుక వాళ్ల బ్రెయిన్ లేదా మనసు ఉంటుంది. కొందరు మనసుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. మరికొందరు బ్రెయిన్‌తో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడైనా వివేకంతో ఆలోచించేవాడు.. బ్రెయిన్ మాట వింటాడట. మనసు మాట వినేవాడు మాత్రం ప్రోయాక్టివ్ బిహేవియర్‌ను కలిగి ఉంటాడట. ఈ ప్రోయాక్టివ్ బిహేవియర్ అంటే.. ఇతరులు కష్టాల్లో ఉంటే తట్టుకోలేకపోవడం, ఎప్పుడూ ఎదుటివారికి సాయం చేయాలనే గుణాన్ని కలిగి ఉండటం. దీన్నే ఎమోషనల్ అని కూడా అంటారు. మనసు చెప్పిన మాట వినడం వల్ల చాలామంది ఇతరుల చేతుల్లో మోసపోతుంటారట. దానికి కారణం.. ఎదుటివాళ్లను ఈజీగా నమ్మేయడం. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వెంటనే తమ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయడం.. ఎదుటివారి కష్టాలను తెలుసుకొని ఎమోషనల్ అవడం అనేది ఎదుటివారికి చాన్స్‌గా మారుతుందని.. అందుకే ఎమోషనల్‌గా ఉండేవారు.. మనసు మాట వినేవారు.. ఈజీగా వేరేవాళ్ల బుట్టలో పడతారట.
కానీ.. రేషనల్‌గా ఆలోచించేవాళ్లు.. బ్రెయిన్ మాట వింటారట. బ్రెయిన్ మాట వినేవాళ్లు అంత తొందరగా ఏ విషయంలోనూ కన్విన్స్ కారు. లాజిక్ మాట్లాడుతారు. ఎలాంటి ఎమోషన్స్‌కు లొంగరు.. అని పరిశోధకులు చెబుతున్నారు.
మంజా గార్ట్నర్ అనే రీసెర్చర్ తన టీమ్‌తో కలిసి 1828 మందిపై రీసెర్చ్ చేశారు. వాళ్లు తీసుకునే నిర్ణయాల ఆధారంగా.. రేషనల్ థింకింగ్ ఉన్నవాళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఎమోషనల్ థింకింగ్ ఉన్నవాళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఒక అంచనాకు వచ్చారు. తద్వారా.. రేషనల్ థింకింగ్ ఉన్నవాళ్లు బ్రెయిన్ చెప్పినట్టు వింటారని.. ఒకటికి పది సార్లు ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకుంటారని పరిశోధకులు ఒక అంచనాకు వచ్చారు. అదే ఎమోషనల్ థింకింగ్ ఉన్నవాళ్లు తమ మనసు ఏది చెబితే అది వింటారని.. చాలా త్వరగా వీళ్లు నిర్ణయాలు తీసుకుంటారని.. వీళ్లు బ్రెయిన్ మాటను బేఖాతరు చేస్తారని రీసెర్చ్‌లో వెల్లడైంది.