Watch: ఏనుగుల గుంపుతో సెల్ఫీకి కొందరు యత్నం… తర్వాత ఏం జరిగిందంటే!
న్యూఢిల్లీ: ఏనుగుల గుంపుతో సెల్ఫీ తీసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. దీని కోసం రోడ్డు మధ్యలో వాహనాలు ఆపారు. ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ కోసం ఆ ఏనుగుల గుంపు సమీపానికి వెళ్లారు. దీంతో ఆగ్రహించిన ఏనుగులు వారి వెంటపడ్డాయి. అయితే ఆ వ్యక్తులపై దాడిని అవి విరమించుకున్నారు. దీంతో వారు బతికిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్లో శనివారం పోస్ట్ చేశారు. జంతువులతో సెల్ఫీలు ప్రమాదకరమని హెచ్చరించారు. ‘వన్యప్రాణులతో సెల్ఫీ మోజు ప్రాణాంతకం కావచ్చు. ఈ వ్యక్తులు అదృష్టవంతులు. సున్నితమైన ఏనుగుల గుంపు వారి ప్రవర్తనను క్షమించాయి. లేకపోతే శక్తివంతమైన అవి వారికి గుణపాఠం చెప్పడానికి పెద్దగా సమయం పట్టదు’ అని పేర్కొన్నారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైలర్ అయ్యింది. ఇప్పటికే 63 వేలకుపైగా ఈ వీడియోను వీక్షించారు. నెటిజన్లు కూడా ఆ వ్యక్తుల తీరుపై మండిపడ్డారు. ఒకవేళ ఏదైనా జరుగరానిది జరిగితే జంతువులనే తప్పుపడతారని ఒకరు అన్నారు. వన్యప్రాణులతో చెలగాటమాడేవారికి భారీగా జరిమానాలు విధించాలని మరొకరు డిమాండ్ చేశారు.
Selfie craze with wildlife can be deadly. These people were simply lucky that these gentle giants chose to pardon their behaviour. Otherwise, it does not take much for mighty elephants to teach people a lesson. video-shared pic.twitter.com/tdxxIDlA03
— Supriya Sahu IAS (@supriyasahuias) August 6, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

