Soumya Swaminathan: ఇంకొన్నాళ్లు కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందే..!
Soumya Swaminathan: అన్ని దేశాల్లో జనం ఇంకొన్నాళ్లు కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్టు సౌమ్యాస్వామినాథన్ చెప్పారు.

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదని, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జనం ఇంకొన్నాళ్లు కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్టు సౌమ్యాస్వామినాథన్ ( Soumya Swaminathan ) చెప్పారు. ఇది రక్షణలు వదిపెట్టాల్సిన సమయం కాదని, నిబంధనలు ఇంకా కొనసాగించాల్సిందేనని ఆమె సూచించారు. మరో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని సౌమ్యాస్వామినాథన్ చెప్పారు.
మరో ఆరు నెలల కల్లా వ్యాక్సినేషన్ పూర్తయిన వారి సంఖ్య బాగా పెరుగుతుందని, ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ పూర్తయితే పరిస్థితులు మెరుగుపడటం మొదలవుతుందని స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. కాగా, సౌమ్యాస్వామినాథన్ చెప్పినట్లే ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గలేదు. భారత్, అమెరికా, చైనా తదితర దేశాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే సౌమ్యాస్వామినాథన్ తాజా సూచన చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

