Amarnath Yatra | జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర ఆగస్టు 31 వరకు మంచు శివలింగాన్ని దర్శించుకునే అవకాశం
పవిత్ర అమర్నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు రానున్నారు.
Amarnath Yatra | న్యూఢిల్లీ: పవిత్ర అమర్నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు రానున్నారు. గత ఏడాది 3.45 లక్షల మంది అమర్నాథ్ యాత్రలో పాల్గొనగా ఈసారి 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఆకస్మిక వరదల కారణంగా 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అమర్నాథ్కు వెళ్లే బట్కల్, పహల్గామ్ దారుల్లో భారీగా మంచు పేరుకొని ఉండటంతో జూన్ 15 నాటికి మంచును తొలగించే పనిని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేపట్టింది. మరోవైపు యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉందనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం యాత్ర భద్రతా ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఆరోగ్యకరమైన ఆహారాన్నే అనుమతించాలని అమర్నాథ్జీ ఆలయ బోర్డు నిర్ణయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

