Baba Ramdev | యోగా గురువు బాబా రాందేవ్‌కు రూ.50లక్షల జరిమానా..!
Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు బాంబే హైకోర్టు బుధవారం రూ.50లక్షల జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన నేపథ్యంలో జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నది.
Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు బాంబే హైకోర్టు బుధవారం రూ.50లక్షల జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన నేపథ్యంలో జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. పతంజలి ఆయుర్వేదానికి వ్యతిరేకంగా కర్పూరం ఉత్పత్తులకు సంబంధించి.. హైకోర్టులో ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు సంబంధించిన పిటిషన్ దాఖలైంది. గతేడాది ఆగస్టు 30న కర్పూరం ఉత్పత్తులు విక్రయించకుండా పతంజలిపై కోర్టు బ్యాన్ విధించింది. అయితే, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లుగా కోర్టు దృష్టికి వచ్చింది.
దీంతో జస్టిస్ ఆర్ఐ ఐ చాగ్లా మరోసారి కేసును విచారించారు. ఆగస్టులో జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి.. పతంజలి ఉత్పత్తులను సరఫరా చేసినట్లు కోర్టు గుర్తించింది. ఈ మేరకు కోర్టు జరిమానా విధించింది. ఉత్తర్వులు జారీ చేసిన వారం రోజుల్లోగా రూ.50లక్షలు డిపాజిట్ చేయాలని పతంజలిని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల తర్వాత పతంజలి అఫిడవిట్ ఇచ్చిందని, అందులో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరగా.. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పినట్లు తెలుస్తున్నది. ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత జూన్ 2024 వరకు డిస్ట్రిబ్యూటర్లకు రూ.49,57,861 విలువైన కర్పూరం ఉత్పత్తిని సరఫరా చేసినట్లు అఫిడవిట్లో పతంజలి అంగీకరించింది. ఇంకా రూ.25,94,505 విలువైన ఉత్పత్తులు డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఉన్నాయని, విక్రయాలను నిలిపివేసినట్లు పేర్కొంది. ఈ ఏడాది జూన్ తర్వాత సైతం పతంజలి ఉత్పత్తులను విక్రయించినట్లు మంగళం ఆర్గానిక్స్ పేర్కొంది.
జూలై 8 వరకు వెబ్సైట్లో కర్పూరం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని కోర్టుకు చెప్పింది. మంగళం ఆర్గానిక్స్ ఇచ్చిన ఈ సమాచారం పతంజలి అఫిడవిట్లో లేకపోవడంతో.. 50 లక్షలు డిపాజిట్ చేయాలని పతంజలిని ఆదేశించడంతో పాటు అఫిడవిట్ దాఖలు చేయాలని మంగళవం ఆర్గానిక్స్‌కు సూచించింది. ఈ కేసు విచారణ మళ్లీ ఈ నెల 19న జరుగనున్నది. ఇదిలా ఉండగా.. మరో వైపు పతంజలి గ్రూప్ 14 రకాల ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసినట్లు పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న కంపెనీ ఉత్పత్తుల ప్రకటనలపై కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

