Parliament | ఈ సెషన్లోనే పార్లమెంట్ ముందుకు ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ బిల్లు
Parliament | ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సర్కారు యోచిస్తోంది.
Parliament : ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సర్కారు యోచిస్తోంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వచ్చే పార్లమెంట్ సెషన్లో బిల్లును కచ్చితంగా ఉభయసభల ముందుకు తీసుకురావాలని భావిస్తోంది.
లోక్‌సభ ఎన్నికలతోపాటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకే దఫా ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ బిల్లుకు సంబంధించి పలు సిఫారసులు చేసింది. అనంతరం బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడమే తరువాయిగా ఉంది.
ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్ర పడితే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పంపాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. జేపీసీ అన్ని పార్టీల ప్రతినిధులతో ఈ బిల్లుపై చర్చించి అందరి అంగీకారాన్ని తీసుకోనుంది. అంతేగాక అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్ల నుంచి ప్రభుత్వం ఈ బిల్లుపై అభిప్రాయాలు కోరింది.
మేథావులు, నిపుణులు, పౌర సమాజ సభ్యులు తదితరులను కూడా ఈ బిల్లుపై చర్చలో భాగస్వాములను చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆ తర్వాత సాధారణ ప్రజానీకం నుంచి కూడా ఈ బిల్లుపై అభిప్రాయాలను కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్ ఇదే నిర్మల్ గడ్డ మీద తెలంగాణను తీసుకొస్తా అన్నరు : కేటీఆర్
రైతు వ్యతిరేక విధానాలపై కవులు తమ కలాలను ఎక్కుపెట్టాలి : నందిని సిధారెడ్డి
Girl falls into water tank, 4 Dies | నీటి ట్యాంకులో పడిన బాలిక.. రక్షించే క్రమంలో ఆమెతో సహా నలుగురు మృతి
‘పూర్తిస్థాయి బోనస్ చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదు’
Dasoju Shravankumar | రూ.1000 కోట్ల బీసీ భూములను కాంగ్రెస్ సర్కార్ దోచిపెట్టింది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

