Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
Woman body in Pune flat | తమ కుమార్తె లండన్‌లో చదువుతున్నట్లు ఆమె తల్లిదండ్రులు భావించారు. అయితే మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉండటంతో లండన్‌లో ఉన్న ఆమె ఫ్రెండ్‌ను సంపద్రించారు. రెండు నెలల కిందట భారత్‌కు తిరిగి వచ్చినట్లు తెలుసుకున్నారు. ఒక ఫ్లాట్‌లో కుమార్తె మృతదేహాన్ని పోలీసులు గుర్తించడంతో వారు షాక్ అయ్యారు.
ముంబై: తమ కుమార్తె లండన్‌లో చదువుతున్నట్లు ఆమె తల్లిదండ్రులు భావించారు. అయితే మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉండటంతో లండన్‌లో ఉన్న ఆమె ఫ్రెండ్‌ను సంపద్రించారు. రెండు నెలల కిందట భారత్‌కు తిరిగి వచ్చినట్లు తెలుసుకున్నారు. ఒక ఫ్లాట్‌లో కుమార్తె మృతదేహాన్ని పోలీసులు గుర్తించడంతో వారు షాక్ అయ్యారు. (Woman body in Pune flat) మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన 34 ఏళ్ల ముగ్ధా దేశ్‌ముఖ్, ఎంబీఏ చదివేందుకు 2025 జూలైలో బ్రిటన్ వెళ్లింది. లండన్‌లో చదువుతున్న ఆమె అక్కడ ఒంటరిగా నివసించడంతో పాటు పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా చేసింది.
కాగా, అక్టోబర్ 22న కుమార్తె ముగ్ధా ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉండటంతో తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడలేకపోయారు. ఆందోళనతో లండన్‌లో ఉంటున్న ఆమె ఫ్రెండ్‌ను సంప్రదించారు. ఆ స్నేహితురాలు లండన్ పోలీసులను ఆశ్రయించగా ఆగస్ట్ నెలాఖరులో ముగ్ధా యూకే విడిచి వెళ్ళినట్లు తెలిసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సహాయం కోసం భారత అధికారులను, భారత హైకమిషన్‌ను సంప్రదించారు.
మరోవైపు ముగ్ధా తండ్రి అవినాష్ తన కుమార్తె బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించారు. అక్టోబర్ 8 నుంచి 25 మధ్య స్థానికంగా ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ సర్వీస్ ప్లాట్‌ఫామ్‌లలో అనేక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఉస్మాన్‌పురా ప్రాంతంలో ఒక ట్రాన్సాక్షన్ గమనించిన కుటుంబ సభ్యులు ముగ్ధా మహారాష్ట్రలో ఉన్నట్లు అనుమానించారు. ఆమె భద్రతపై ఆందోళన చెందటంతో అక్టోబర్ 24న ఛత్రపతి సంభాజీనగర్ పోలీసులను ఆశ్రయించారు.
కాగా, ముగ్ధా గురించి పోలీసులు దర్యాప్తు చేశారు. పూణేలోని గహుంజేలో లోధా బెల్మొండో కాంప్లెక్స్‌లో ఆమె నివసిస్తునట్లు తెలుసుకున్నారు. ఛత్రపతి సంభాజీనగర్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తాళాలు బాగుచేసే వ్యక్తి సహాయంతో ముగ్ధా నివసించే అపార్ట్మెంట్లోకి ప్రవేశించగా ఆమె మృతదేహం కనిపించింది. పోస్ట్‌మార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ముగ్ధా మృతదేహంపై ఎలాంటి గాయాల గుర్తులు కనిపించలేదని పోలీస్ అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఆమె మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని చెప్పారు. ఏప్రిల్‌లో ఆ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నప్పటికీ, ఆగస్ట్‌లో లండన్ నుంచి వచ్చిన తర్వాతే ముగ్ధా అక్కడ నివసిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆమె మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- body
- Daughter
- flat
- food delivery
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

