Hooch Tragedy | తమిళనాడు గవర్నర్‌ను కలిసిన ఏఐఏడీఎంకే ప్రతినిధి బృందం
Hooch Tragedy : తమిళనాడులోని కళ్లకురిచి నాటు సారా ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ వ్యవహరంపై డీఎంకే సర్కార్, సీఎం ఎంకే స్టాలిన్ లక్ష్యంగా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
Hooch Tragedy : తమిళనాడులోని కళ్లకురిచి నాటు సారా ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ వ్యవహరంపై డీఎంకే సర్కార్, సీఎం ఎంకే స్టాలిన్ లక్ష్యంగా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కళ్లకురిచి ఘటనకు సంబంధించి ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి కే పళనిస్వామి ఆ పార్టీ నేతలు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని రాజ్‌భవన్‌లో మంగళవారం కలిశారు.
గవర్నర్‌తో భేటీ అనంతరం పళనిస్వామి విలేకరులతో మాట్లాడుతూ కల్తీ మద్యం ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం ఎంకే స్టాలిన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు వెలుగుచూసేందుకు ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు.
అటవీ శాఖ అధికారులను కూడా విచారించాలని అన్నారు. సీబీసీఐడీ విచారణతో ఈ కేసులో వాస్తవాలు బయటపడవని చెప్పారు. ఏకసభ్య కమిషన్ విచారణతో కూడా ఎలాంటి ఉపయోగం లేదని పెదవివిరిచారు. కళ్లకురిచి కల్తీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ గవర్నర్‌కు తాము వినతిపత్రం సమర్పించామని పళనిస్వామి వెల్లడించారు.
Read More :
Nita Ambani | పదేళ్ల తర్వాత కాశీకి వెళ్లిన నీతా అంబానీ.. రోడ్‌సైడ్ షాప్‌లో చాట్ తిని
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

