ఆదివారం 29 మార్చి 2020
National - Feb 11, 2020 , 02:01:19

ముంబై పేలుళ్ల కేసు.. హలారీ అరెస్ట్‌

ముంబై పేలుళ్ల కేసు.. హలారీ అరెస్ట్‌

అహ్మదాబాద్‌: ముంబైలో 1993లో జరిగిన వరుస పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు మునాఫ్‌ హలారీని గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని మాదకద్రవ్యాల కేసులో ఆదివారం అర్ధరాత్రి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ముంబై ఉగ్రదాడికి కుట్రపన్నిన టైగర్‌ మెమన్‌కు హలారీ అత్యంత సన్నిహితుడు. 1993లో వరుస పేలుళ్ల కోసం హలారీ మూడు స్కూటర్లను కొనుగోలు చేసి వాటికి బాంబులు అమర్చాడు.

logo