పాక్ నుంచి డ్రోన్లతో ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా

న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో కాల్పుల ఘటనలు తగ్గాయని, కానీ పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు త్రివిధదళాల చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కాల్పులు నిలిచిపోయాయని, ఇది పాజిటివ్ సంకేతమని, కానీ ఇదే సమయంలో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు తేలిందన్నారు. డ్రగ్స్, వెపన్స్ వల్ల అంతర్గత శాంతి దెబ్బతింటుందని రావత్ తెలిపారు. ఉగ్రవాదం వైపు మళ్లుతున్న కశ్మీరీ యువతను రక్షించుకోవాలన్నారు. కశ్మీరీ యువతను గుర్తించి, ఉగ్రవాదం వల్ల జరిగే నష్టాల గురించి వారికి తెలియచెప్పాలన్నారు. త్రివిధ దళాలను ఏకీకరించే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. మూడు రక్షణ దళాలు ఒక్కటైతే, భవిష్యత్తులో మనం దేన్నైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bipin Rawat
- CDS Chief
- drones
- drugs
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

