పంజాబ్‌లో పాక్ బోటు స్వాధీనం.. అప్రమత్తమైన బలగాలు
Pakistan boat found in Pathankot | భారత్ - పాక్ సరిహద్దును ఆనుకొని ఉన్న బమియాల్ పట్టణంలోని తర్నాహ్ డ్రెయిన్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఓ పడవ కనిపించింది.

న్యూఢిల్లీ : భారత్ – పాక్ సరిహద్దును ఆనుకొని ఉన్న బమియాల్ పట్టణంలోని తర్నాహ్ డ్రెయిన్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఓ పడవ కనిపించింది. దీంతో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. నరోత్ జైమల్‌సింగ్, బమియాల్ పోలీసులతో పాటు నిఘా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. ప్రస్తుతం పఠాన్‌కోట్ పోలీసులు బోటులో సోదాలు జరిపి, స్వాధీనం చేసుకున్నారు. పడవపై ఎలాంటి గుర్తులు, రాతలు లేవని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ముందు జాగ్రత్తగా పఠాన్‌కోట్ పోలీసులు, బీఎస్ఎఫ్ పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సరిహద్దు భద్రతా దళం నది ప్రవాహంలో వచ్చిన పడవ తర్నాహ్ డ్రెయిన్ గుండా పాక్ పడవ భారత్ వైపు చేరుకుందని బమియాల్ పోలీస్ అవుట్ పోస్ట్ ఇన్చార్జి తార్సేమ్ సింగ్ పేర్కొన్నారు. బోట్‌ను సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
గూఢచర్యానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
గూఢచర్యం ఆరోపణలపై పఠాన్‌కోట్‌లో స్టేట్ ఆపరేషన్ సెల్ ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది. నిందితుడికి పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన మహిళా అధికారితో పరిచయం ఉన్నట్లు తెలిసింది. నిందితుడు పఠాన్‌కోట్‌లోని మిలటరీ కంటోన్మెంట్ సమీపంలోని క్రషర్లో పని చేసేవాడు. మహిళా అధికారి నిందితులను హనీ ట్రాప్‌లో ఇరికించడంతో పాటు డబ్బు ఆశ చూపి దేశంలోని ముఖ్యమైన సమాచారాన్ని పాక్‌కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్ఐకి చేరవేస్తున్నట్లు గుర్తించారు. మరో కేసులో కృనాల్ కుమార్ భరియాను అక్టోబర్ 23న స్టేట్ ఆపరేషన్ సెల్ అరెస్టు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

