బెంగళూరు: భారత పోర్ట్‌కు చేరుకున్న విదేశీ కార్గో షిప్లో పాకిస్థాన్ జాతీయుడు ఉన్నాడు. దీంతో పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. భారత్‌లోకి అతడి ప్రవేశాన్ని నిరాకరాంచారు. పోర్డులోకి అడుగుపెట్టకుండా నిరోధించారు. (Pak National Denied Entry) మే 12న ఇరాక్‌కు చెందిన ఎంటీఆర్ ఓషన్ అనే కార్గో షిష్ బిటుమెన్ లోడ్‌తో కర్ణాటకలోని కార్వార్ పోర్టుకు చేరుకున్నది. అందులో షిప్ కెప్టెన్‌తో సహా 14 మంది భారతీయులు, ఇద్దరు సిరియన్లు, ఒక పాకిస్థాన్ జాతీయ సిబ్బంది ఉన్నారు.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ జాతీయులకు భారత్‌లోకి ప్రవేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వారి వీసాలను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇరాక్ కార్గో నౌకలో పాకిస్థాన్ జాతీయుడు ఉన్నట్లు తెలుసుకుని కార్వార్ పోర్టు పోలీసులు, అధికారులు అలెర్ట్ అయ్యారు. ఆ కార్గో షిప్‌లోకి వారు వెళ్లారు.
మరోవైపు పాకిస్థాన్, సిరియా జాతీయులను ఓడ నుంచి కిందకు దిగవద్దని పోలీస్ ఇన్స్పెక్టర్ నిశ్చల్ కుమార్ ఆదేశించారు. అలాగే పోలీస్ అధికారి సూచన మేరకు వారి మొబైల్ ఫోన్లను షిప్ కెప్టెన్ స్వాధీనం చేసుకున్నారు. పోర్టులో బిటుమెన్‌ను అన్లోడ్ చేసిన తర్వాత ఆ కార్గో షిప్ తిరిగి ఇరాక్‌కు బయలుదేరిందని కార్వార్ పోర్టు అధికారులు వెల్లడించారు.